షర్మిలతో బంగారు తెలంగాణ సాధ్యం: విజయమ్మ
ABN , First Publish Date - 2021-10-20T20:40:47+05:30 IST
వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలతో బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా

రంగారెడ్డి: వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి షర్మిలతో బంగారు తెలంగాణ సాధ్యమని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. షర్మిల పాదయాత్ర సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో విజయమ్మ మాట్లాడుతూ వైఎస్సార్ పాలన సువర్ణ యుగమని కొనియాడారు. వైఎస్సార్ ఆశయాలను షర్మిల నెరవేరుస్తారని తెలిపారు. షర్మిల ఏది పట్టుకున్నా సాధించే వరకు వదలదని తెలిపారు. చేవెళ్ల ప్రజాప్రస్థానం పాదయాత్ర చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్ పాదయాత్ర ఉమ్మడి ఏపీ చరిత్రనే మార్చి వేసిందని, పాదయాత్రతో రాష్ట్రాన్ని వైఎస్సార్ అవగాహన చేసుకున్నారని చెప్పారు. షర్మిల పాదయాత్రకు ప్రజల ఆశీర్వాదం కావాలని విజయమ్మ కోరారు.