చర్లపల్లి జైలుకు ఎన్‌ఎస్‌యుఐ నేతలు
ABN , First Publish Date - 2021-05-09T04:04:56+05:30 IST
చర్లపల్లి జైలుకు ఎన్‌ఎస్‌యుఐ నేతలు

హైదరాబాద్: ఎన్‌ఎస్‌యుఐ నేతలకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వారిని పోలీసులు చర్లపల్లి జైలుకు తరలించారు. శుక్రవారం మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేపట్టారు. విద్యార్థి నేత బలమూరి వెంకట్‌తో పాటు 13 మందిపై 8 సెక్షన్లలో కేసులు నమోదు చేశారు. శనివారం 13 మందికి కరోనా టెస్టులు చేసి మేడ్చల్ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అయితే కోవిడ్ పరీక్షలలో పృథ్వీ అనే విద్యార్థికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో అతనికి చికిత్సకు అనుమతించారు. మిగిలిన విద్యార్థులకు 14 రోజులు రిమాండ్ విధించారు.