‘జల్‌ జీవన్‌’ను వినియోగించుకోని తెలంగాణ

ABN , First Publish Date - 2021-02-05T08:58:15+05:30 IST

ఇంటింటికి నల్లా నీరు అందించడానికి జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్తన్‌ లాల్‌ కఠారియా...

‘జల్‌ జీవన్‌’ను వినియోగించుకోని తెలంగాణ

  • లోక్‌సభలో ఎంపీల ప్రశ్నలకు కేంద్రం సమాధానం


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ఇంటింటికి నల్లా నీరు అందించడానికి జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద కేంద్రం ఇచ్చిన నిధులను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వినియోగించుకోలేదని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రత్తన్‌ లాల్‌ కఠారియా వెల్లడించారు. లోక్‌సభలో ఓ ప్రశ్నకు మంత్రి గురువారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2020- 21లో ఇప్పటి వరకు రూ.412కోట్లు కేటాయించి, రూ.82కోట్లు విడుదల చేయగా, అందులో రూ.57.88కోట్లను వినియోగించుకున్నట్లు వివరించారు. 

Updated Date - 2021-02-05T08:58:15+05:30 IST