దళితబంధుకు మేము వ్యతిరేకం కాదు: పద్మనాభరెడ్డి

ABN , First Publish Date - 2021-10-19T21:33:11+05:30 IST

దళితబంధును తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీకి జులైలో లేఖరాశామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి అన్నారు.

దళితబంధుకు మేము వ్యతిరేకం కాదు: పద్మనాభరెడ్డి

హైదరాబాద్: దళితబంధును తాత్కాలికంగా నిలిపివేయాలని ఈసీకి జులైలో లేఖరాశామని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కన్వీనర్ పద్మనాభరెడ్డి అన్నారు. ఫిర్యాదు చేసిన 3నెలల తర్వాత ఈసీ చర్యలు తీసుకోవడం బిగ్‌ జోక్ అని చెప్పారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో దళితబంధు ఇవ్వడం సరికాదని తమ అభిప్రాయమన్నారు. దళితబంధుకు తాము వ్యతిరేకం కాదన్నారు. దళితబంధు ద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే దళితబంధు చేపడుతున్నామని సీఎం అన్నప్పుడు ఎస్ఈసీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.

Updated Date - 2021-10-19T21:33:11+05:30 IST