ఫిల్లింగ్ స్టేషన్‌పై ఫిర్యాదు.... ఫిల్లింగ్ స్టేషన్ సీజ్

ABN , First Publish Date - 2021-10-08T02:50:22+05:30 IST

జిల్లాలోని మునగాలలోని సందీప్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఫిర్యాదు చేశారు. పెట్రోలు, డీజిల్ రీడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు.

ఫిల్లింగ్ స్టేషన్‌పై ఫిర్యాదు.... ఫిల్లింగ్ స్టేషన్ సీజ్

సూర్యాపేట: జిల్లాలోని మునగాలలోని సందీప్ ఫిల్లింగ్ స్టేషన్‌పై ఫిర్యాదు చేశారు. పెట్రోలు, డీజిల్ రీడింగ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిల్లింగ్ స్టేషన్‌ను తూనికలు కొలతలశాఖ అధికారులు తనిఖీ చేశారు. చిప్స్‌తో రీడింగ్‌లో అవకతవకలు జరిగినట్టు నిర్ధారరించారు. ఫిల్లింగ్ స్టేషన్ ను అధికారులు సీజ్ చేశారు. యజమాని రామాంజనేయులు, లీజ్‌కు తీసుకున్న నరసింహారావు, చిప్ అమర్చిన నర్సింగరావుపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

 

Updated Date - 2021-10-08T02:50:22+05:30 IST