బాతుల లారీ బోల్తా... వెయ్యి బాతులు మృతి

ABN , First Publish Date - 2021-08-11T01:52:33+05:30 IST

బాతుల లారీ బోల్తా... వెయ్యి బాతులు మృతి

బాతుల లారీ బోల్తా... వెయ్యి బాతులు మృతి

మహబూబాబాద్: జిల్లాలోని నెల్లికుదురు మండలం మునిగలవీడు గ్రామ సమీపంలో రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మొండివాగువద్ద బాతుల లారీ  అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో 1000 బాతులు మృతి చెందాయి. అలాగే ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-08-11T01:52:33+05:30 IST