సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్
ABN , First Publish Date - 2021-10-29T22:07:44+05:30 IST
వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా...
హైదరాబాద్: వరి విత్తనాలు అమ్మకూడదన్న సిద్దిపేట కలెక్టర్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌లో తెలంగాణ ప్రభుత్వం, సిద్దిపేట కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి మండల వ్యవసాయ అధికారులను ప్రతివాదులుగా పిటిషనర్ చేర్చారు. వరి విత్తనాలు అమ్మకూడదంటూ జారీ చేసిన ఆదేశాలు చట్టవిరుద్ధమైనవని బాతుల నారాయణ పిటిషన్‌లో పేర్కొన్నారు.