317జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ High court నిరాకరణ
ABN , First Publish Date - 2021-12-30T18:25:42+05:30 IST
317 జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది.

హైదరాబాద్: 317 జీవోపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 317 జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. 371డిని పార్లమెంట్‌లో ఆమోదించకుండా బదిలీలు చేపట్టడం సరైంది కాదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. 317 జీవోపై స్టే ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది పివి కృష్ణయ్య ధర్మాసనాన్ని కోరారు. అయితే స్టే ఇవ్వడానికి హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ నిరాకరించారు. ప్రతివాదుల వివరణ తీసుకున్న తర్వాత నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తేల్చి చెప్పింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.