తెలంగాణ రైతు కుటుంబాల్లో 61.2 శాతం అక్షరాస్యత

ABN , First Publish Date - 2021-10-14T08:58:17+05:30 IST

తెలంగాణ రైతు కుటుంబాల్లో 61.2 శాతం అక్షరాస్యత మాత్రమే ఉంది. ఈ విషయంలో దేశంలోని చాలా రాష్ట్రాల కంటే...

తెలంగాణ రైతు కుటుంబాల్లో 61.2 శాతం అక్షరాస్యత

  • జాతీయస్థాయిలో 73.6% 
  • జాతీయ నమూనా సర్వేలో వెల్లడి

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రైతు కుటుంబాల్లో 61.2 శాతం అక్షరాస్యత మాత్రమే ఉంది. ఈ విషయంలో దేశంలోని చాలా రాష్ట్రాల కంటే తెలంగాణ రైతులు వెనుకబడి ఉన్నారు. జాతీయ స్థాయిలో రైతు కుటుంబాల్లో 73.6 శాతం అక్షరాస్యత ఉంటే... రాష్ట్రంలో మాత్రం జాతీయ స్థాయి కన్నా 12.4 శాతం తక్కువగా నమోదయింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 77వ జాతీయ నమూనా సర్వేలో ఈ విషయం స్పష్టమయింది. తాజాగా విడుదలైన ఈ సర్వే ప్రకారం... దేశంలోని గ్రామీణ రైతు కుటుంబాల్లో 73.6 శాతం అక్షరాస్యత నమోదైంది. తెలంగాణలో మాత్రం 61.2 శాతం రైతు కుటుంబాల్లోనే అక్షరాస్యత ఉంది. దేశంలో వెనుకబడిన బిహార్‌లో 73.8 శాతం, ఛత్తీ్‌సగఢ్‌లో 70.3 శాతం మంది రైతు కుటుంబాలకు అక్షరాస్యత ఉంది. పదో తరగతి కన్నా ఎక్కువ చదివిన రైతులు తెలంగాణలో తక్కువగా ఉన్నారు. రాష్ట్రంలోని రైతు కుటుంబాల్లో 34.2 శాతం మంది మాత్రమే సెకండరీ స్థాయి విద్య కన్నా ఎక్కువ చదివారు.

Updated Date - 2021-10-14T08:58:17+05:30 IST