ఉద్యోగులకు పండుగ కానుక ప్రకటించాలి

ABN , First Publish Date - 2021-01-13T08:38:21+05:30 IST

పీఆర్సీ ఇంకెప్పుడిస్తారని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. సీఎం కేసీఆర్‌ సంక్రాంతి పండుగ కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని, వేతన సవరణకు నివేదిక కూడా

ఉద్యోగులకు పండుగ కానుక ప్రకటించాలి

తెలంగాణ ఉద్యోగుల సంఘం


హైదరాబాద్‌, జనవరి 12(ఆంధ్రజ్యోతి): పీఆర్సీ ఇంకెప్పుడిస్తారని ప్రభుత్వాన్ని తెలంగాణ ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. సీఎం కేసీఆర్‌ సంక్రాంతి పండుగ కానుక కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారని, వేతన సవరణకు నివేదిక కూడా తెప్పించుకున్నందున ఫిట్‌మెంట్‌ను వెంటనే ప్రకటించాలని సంఘం అధ్యక్షుడు సంపత్‌కుమార్‌ స్వామి డిమాండ్‌ చేశారు. వేతన సవరణ కమిషన్‌ సమర్పించిన నివేదిక కాపీ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. 


సీపీఎస్‌ రద్దుపై నిర్ణయం తీసుకోవాలి: సీపీఎస్‌ సంఘం

ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌.. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎ్‌స)ను రద్దు చేయడంపైనా నిర్ణయం తీసుకోవాలని సీపీఎస్‌ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాముక కమలాకర్‌ డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-01-13T08:38:21+05:30 IST