గవర్నర్‌ను కలిసిన తెలంగాణ బీజేపీ ప్రతినిధుల బృందం
ABN , First Publish Date - 2021-01-12T17:56:39+05:30 IST
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు...

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్య, వీసీల నియామకం, ఉద్యోగాల భర్తీపై రాష్ట్ర గవర్నర్ తమిళ్ సౌందర్య రాజన్ని మంగళవారం రోజు బీజేపీ ప్రతినిధులు కలిసారు. రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి బీజేపీ నాయకులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు. త్వరగా రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. గవర్నర్‌తొ భేటీ అయిన వారిలో బీజేపీ నేతలు లక్ష్మణ్, మురళీధర్ రావ్, రామచందర్ రావు ఉన్నారు.