‘టిక్‌టాక్‌’ ప్రేమ ముదిరి.. ప్రియుడి ఇంటికి బాలిక

ABN , First Publish Date - 2021-02-05T09:16:05+05:30 IST

టిక్‌టాక్‌లో పరిచయం ప్రేమగా మారింది. అది కాస్తా ముదిరి.. ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది ఓ బాలిక. నల్లగొండ జిల్లాకు చెందిన బాలిక(16) హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతోంది...

‘టిక్‌టాక్‌’ ప్రేమ ముదిరి.. ప్రియుడి ఇంటికి బాలిక

నిడమనూరు, ఫిబ్రవరి 4: టిక్‌టాక్‌లో పరిచయం ప్రేమగా మారింది. అది కాస్తా ముదిరి.. ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది ఓ బాలిక. నల్లగొండ జిల్లాకు చెందిన బాలిక(16) హైదరాబాద్‌లో ఇంటర్‌ చదువుతోంది.  ఈ నెల 22న ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక తిరిగి రాలేదు. దీంతో నిడమనూరు పోలీసుల కు ఆమె తల్లి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పో లీసులు.. కామారెడ్డి జిల్లాలోని తుజల్‌పూర్‌లో ఓ యువకుడి వద్ద ఆ బాలిక ఉన్నట్లు గుర్తించి కౌన్సెలింగ్‌ ఇచ్చి గురువారం తల్లికి అప్పగించారు.

Updated Date - 2021-02-05T09:16:05+05:30 IST