అనధికార డిప్యూటేషన్లు

ABN , First Publish Date - 2021-02-09T04:20:10+05:30 IST

అనధికార డిప్యూటేషన్లు

అనధికార డిప్యూటేషన్లు

ఎమ్మార్సీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు


వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, ఫిబ్రవరి 8:  హన్మకొండ, వరంగల్‌, ఖిలావరంగల్‌ మండల వి ద్యా వనరుల కేంద్రాల్లో(ఎమ్మార్సీ)  అనధికార డిప్యూటేషన్లలో పలువురు ఉపాధ్యాయులు తిష్ట వేశారు.  ఉపాధ్యాయులు పాఠశాలల్లో పాఠ్యాంశాలు బోధించాలే తప్ప డీఈవో, ఎంఈవో కార్యాలయాల్లో బోధనేత పనుల కోసం డిప్యూటేషన్‌ వెళ్లవద్దనే నిబంధనలు స్పష్టంగా ఉన్నప్పటికీ ఎమ్మార్సీల్లో సంవత్సరాలుగా తిష్ట వేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ప్రభుత్వ, ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన బిల్లులతో పాటు ప్రైవేటు పాఠశాలల అనుమతులు, గుర్తింపు తదితర పనులను ఎమ్మార్సీల్లో వీరే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  

బోధనేతర ప్రాంతాలకు ఉపాధ్యాయులు డిప్యూటేషన్లపై  వెళ్లవద్ద ని సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అలాంటి ఉత్తర్వులు వీరికి   అడ్డంకిగా మారలేదు సరికదా,  ఉపాధ్యాయులకు సంబంధించిన పనులనే మేం చేస్తున్నాం కదా అని వారు బదులిస్తున్నట్లు తెలుస్తోంది. హన్మకొండ ఎమ్మార్సీలో సెయింట్‌ మెరీస్‌ ఎయిడెడ్‌ పాఠశాలకు చెందిన వి.రాజేంద్రప్రసాద్‌, అమ్మవారిపేట ఎంపీపీఎస్‌ ఉపాధ్యాయుడు శరత్‌, బాసిత్‌నగర్‌లోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుడు బి.జగదీశ్‌ పనిచేస్తున్నారు. ఇక వరంగల్‌ ఎ మ్మార్సీలో రంగశాయిపేటలోని ప్రభుత్వ బాలికల పాఠశాలకుకు చెం దిన సీహెచ్‌.యాదగిరితో పాటు శాకరాసికుంటలోని ప్రభుత్వ ఉర్దూ మీడియం పాఠశాలకు చెందిన జియాసోద్దీన్‌తో పాటు వీరికి సహాయకుడుగా మరో ఎయిడెడ్‌ ఉపాధ్యాయుడు అనధికారికంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మార్సీల్లో అనధికార డిప్యూటేషన్లపై పనిచేస్తు న్న వారిలో కొం దరు జోరుగా పైరవీలు చేస్తూ పబ్బం గడుపుతున్నారని,  అధికారుల కనుసన్నల్లో పాఠశాలలకు ఎగనామం పెడుతున్నార ని ఆరోపణలున్నాయి. ఎయిడెడ్‌ ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్‌ బిల్లులు, ఇన్‌కంట్యాక్స్‌ బిల్లులు చేసేందుకు ప్రత్యేకంగా వ సూలు చేస్తున్నారని,  ‘మేం సంవత్సరాలుగా ఇక్కడే పనిచేస్తున్నాం... మేం చెప్పిందే అధికారులు చేస్తారు..’ అని వారు దబాయిస్తున్నారని పలువురు టీచర్లు పేర్కొంటున్నారు. ఎమ్మార్సీల్లోని అనధికార డిప్యూటేషన్ల విషయమై పలుమార్లు డీఈవో దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోయిందని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు.

Updated Date - 2021-02-09T04:20:10+05:30 IST