పాఠశాలలకు పంతుళ్ల డుమ్మా..

ABN , First Publish Date - 2021-12-09T05:59:49+05:30 IST

పాఠశాలలకు పంతుళ్ల డుమ్మా..

పాఠశాలలకు పంతుళ్ల డుమ్మా..

డీఈవోకు ఫిర్యాదు చేసిన ఎంపీపీ


నెక్కొండ, డిసెంబరు 8 : సమయపాలన పాటిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవాల్సిన ఉపాధ్యాయులు పాఠశాలలకు డుమ్మా కొట్టారు. బుధవారం ఉదయం 10గంటల నుంచి 11 గంటల సమయంలో ఎంపీపీ జాటోతు రమేశ్‌ పలు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేయగా ఉపాధ్యాయులు గైర్హాజరైనట్లు గుర్తించారు. గొట్లకొండ పాఠశాలతో పాటు శివారులోని సూర్యతండా, బడితండా, దుద్యాతండా, అజ్మీరామంగ్యా గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయులెవరూ రాలేదు. దీంతో ఎంపీపీ వెంటనే డీఈవోకు ఫిర్యాదు చేశారు. కాగా గొట్లకొండ ప్రైమరీ పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులకు  ఒక్కరు కూడా రాకపోవడంతో పాఠశా ల ఆవరణలో  ఉపాధ్యాయుల కోసం వేచి ఉన్న 16 మంది విద్యార్థులకు ఎంపీపీ  రమేష్‌ పాఠా లను బోధించారు. సూర్యతండా,  అజ్మీరామంగ్యా తండా, బడితండా పాఠశాలలకు కూడా పంతు ళ్లు రాకపోవడంతో ఆ బడులను తెరవలేదు. కాగా అజ్మీరామంగ్యా  గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఐదు రోజులుగా ఉపాధ్యాయులు రా వడం లేదని గ్రామస్థులు తెలిపారు. సూర్యతం డా  పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండ గా వారు ముందుగానే మూడు రోజుల వరకు సంతకాలు చేసిన విషయం ఎంపీపీ  తనిఖీల్లో వెలుగుచూసింది. ఈ విషయాన్ని డీఈవోకు ఫిర్యాదు చేశామని ఎంపీపీ తెలిపారు. ఈ విష యమై ఎంఈవో రత్నమాలను వివరణ కోరగా విచారణ చేసి చర్య తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-12-09T05:59:49+05:30 IST