పన్నులు సరే.. పనులేవి?

ABN , First Publish Date - 2021-12-25T07:41:31+05:30 IST

ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు,

పన్నులు సరే..   పనులేవి?

  • ఇసుక లారీలతో ఛిద్రమవుతున్న రోడ్లు
  • ఒక్కో ట్రిప్పునకు రూ.250 వరకూ పన్ను
  • ఏడాదికి వసూలయ్యేది 90 కోట్లపైనే
  • ఈ మొత్తం రోడ్ల మరమ్మతుకే ఖర్చు పెట్టాలి
  • కొన్నేళ్లుగా నిధులివ్వని ప్రభుత్వం
  • రోడ్లపై నిత్యకృత్యంగా మారిన ప్రమాదాలు



భూపాలపల్లి నుంచి రేగొండ వరకు నిత్యం వందలాది ఇసుక లారీలు ప్రయాణిస్తుంటాయి. 30 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన రహదారిపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో 18 మంది చనిపోయారు.

హన్మకొండలోని ములుగు క్రాస్‌ రోడ్డు - ఆరేపల్లి మధ్య ఇసుక లారీలు నిత్యం అధిక సంఖ్యలో ప్రయాణిస్తుం టాయి. ఈ రహదారిపై చిన్నపాటి గుంతలను కూడా పూడ్చకపోవడంతో ప్రమాదాలకు అడ్డాగా మారింది. గత ఏడాది ఈ మార్గంలో 15 మంది ప్రాణాలు విడిచారు.


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు, అవసరమైతే కొత్త రోడ్లు వేసేందుకు.. ప్రతి ట్రిప్పుకి రూ.250 చొప్పున పన్నును ప్రభుత్వం ప్రత్యేకంగా వసూలు చేస్తోంది. అయితే, ఇలా వసూలైన మొత్తాన్ని రహదారుల మరమ్మతులకు వినియోగిస్తున్న భూపాలపల్లి నుంచి రేగొండ వరకు నిత్యం వందలాది ఇసుక లారీలు ప్రయాణిస్తుంటాయి. 30 కిలోమీటర్ల మేర ఉన్న ఈ ప్రధాన రహదారిపై ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. గత ఏడాది ఈ రోడ్డుపై జరిగిన ప్రమాదాల్లో 18 మంది చనిపోయారు.


 

 

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

ఇసుక లారీల రాకపోకలతో దెబ్బతిన్న రోడ్లకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసేందుకు, అవసరమైతే కొత్త రోడ్లు వేసేందుకు.. ప్రతి టిప్పుకి రూ.250 చొప్పున పన్నును ప్రభుత్వం ప్రత్యేకంగా వసూలు చేస్తోంది. అయితే, ఇలా వసూలైన మొత్తాన్ని రహదారుల మరమ్మతులకు వినియోగిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. కొత్త రోడ్ల సంగతి దేవుడెరుగు? కనీసం రోడ్లపై గుంతలను కూడా పూడ్చకపోవడంతో ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకొని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంటోంది.


ఎక్కడో ఒక చోట కాదు.. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక లారీలు ప్రయాణిస్తున్న రహదారులపై ఇలాంటి పరిస్థితే ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో తిరిగే లారీలు భారీ ప్రమాదాలకు కారణమవుతూ ప్రాణాలు హరిస్తున్నా.. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. ఇసుక విక్రయాల ద్వారా ఏటా రూ.వందల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్న సర్కార్‌.. క్షేత్ర స్థాయి సమస్యలను మాత్రం గాలికొదిలేసిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  


వసూలయ్యే పన్నులు ఏమైనట్లు?

నిత్యం ప్రయాణించే భారీ వాహనాల సంఖ్యపైనే ఒక రోడ్డు జీవితకాలం ఆధారపడి ఉంటుంది. భారీ వాహనాల సంఖ్య ఎక్కువగా ఉంటే.. రహదారులు కూడా త్వరగా ధ్వసమవుతాయి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకునే లారీల నుంచి మూడు నెలలకోసారి రూ.10వేలకు పైగా రోడ్డు పన్నును ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇది కాకుండా ఇసుక లారీల విషయంలో.. ప్రతి ట్రిప్పునకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాబివృద్ధి సంస్థ (టీఎ్‌సఎండీసీ) రూ.250 చొప్పున వసూలు చేస్తోంది. ఇలా ఇసుక లారీలు చెల్లించే మొత్తమే ఏడాదికి రూ.90 కోట్లు. నిబంధనల ప్రకారం ఈ నిధులను రహదారుల మరమ్మతులకే వినియోగించాలి. టీఎ్‌సఎండీసీ ఆర్జించే ఆదాయం ఆర్థికశాఖకు బదిలీ అయ్యాక.. రహదారుల మరమ్మతుల కోసం రోడ్లు, భవనాల శాఖకు విడుదల చేయాలి. కానీ, ప్రభుత్వం గత కొన్నేళ్లుగా ఈ నిధులను విడుదల చేయకపోవడంతో రహదారులు మరమ్మతులకు మోక్షం కలగడం లేదు.



కనెక్టింగ్‌ రోడ్లు మరింత అధ్వానం 

ఇసుక లారీలతో వెళ్లే ప్రధాన రహదారుల మరమ్మతు బాధ్యత రోడ్లు, భవనాల శాఖది కాగా, రహదారి నుంచి ఇసుక రీచ్‌ వరకు వెళ్లే రహదారుల (కనెక్టింగ్‌ రోడ్ల)ను మరమ్మతు చేసే బాధ్యత పూర్తిగా ఆయా ఇసుక రీచ్‌ కాంట్రాక్టర్లదే. ఈ విషయాన్ని సైతం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో ఇసుక రీచ్‌లు ఉన్న స్థానిక గ్రామాల్లో రహదారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.

ఇసుక లారీల రాకపోకలతో కాళేశ్వరం నుంచి భూపాలపల్లి రోడ్డు, భూపాలపల్లి నుంచి రేగొండ వరకు జాతీయ రహదారి 353(సీ) పూర్తిగా దెబ్బతింది. మహదేవపూర్‌ నుంచి భూపాలపల్లి వరకు రెండేళ్ల కిత్రం నిర్మించిన నాలుగు లేన్ల రోడ్డుపై ప్రస్తుతం మోకాలి లోతు గుంతలు ఉన్నాయి. కాళేశ్వరం నుంచి మహదేవపూర్‌ వరకు రహదారి విస్తరణ పనులు ముందుకు సాగకపోవడంతో అధ్వానంగా తయారైంది.

కామారెడ్డి జిల్లాలోని బిచ్కుంద, బాన్సువాడ, బీర్కూర్‌ మండలాల పరిధిలో ప్రవహించే మంజీరా నదిలో గత ఏడాది నుంచి ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్లు సైతం ధ్వంసమయ్యాయి. భారీ గుంతలు ఏర్పడి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


Updated Date - 2021-12-25T07:41:31+05:30 IST