టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించండి

ABN , First Publish Date - 2021-11-21T08:05:45+05:30 IST

తాజా విద్యుత్‌ ఛార్జీలపై టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కమ్‌లను తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) ఆదేశించింది.

టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించండి

  • డిస్కమ్‌లకు టీఎస్‌ఈఆర్‌సీ ఆదేశం


హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): తాజా విద్యుత్‌ ఛార్జీలపై టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాలని డిస్కమ్‌లను తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్‌సీ) ఆదేశించింది. వాటర్‌బోర్డు కరెంట్‌ ఛార్జీలపై శనివారం ఉత్తర్వుల సందర్భంగా ఈఆర్‌సీ ఆదేశాలు జారీ చేసిం ది. వాటర్‌బోర్డుతో పాటు విద్యుత్‌ వాహనాల ఛార్జింగ్‌ కేంద్రాలపై ఇదివరకే ఇచ్చిన ఉత్తర్వులకు కొనసాగింపుగా కొత్తగా టారిఫ్‌ ప్రతిపాదనలు సమర్పించాలని నిర్దేశించింది. 


విద్యుత్‌ ఒప్పందాల నుంచి వెనక్కి

పాతికేళ్లు పూర్తయిన విద్యుత్‌ ఒప్పందాల నుంచి బయటికి రావడానికి డిస్కమ్‌లకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి అనుమతినిచ్చింది. 1993లో ఎన్టీపీసీకి చెందిన రామగుండం సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ స్టేజ్‌-1, 2తో ఆ తర్వాత 1999లో నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌తో ఏపీ స్టేట్‌ ఎలక్ట్రిసిటీ బోర్డుతో పాటు ఏపీ ట్రాన్స్‌కోలు ఒప్పందాలు చేసుకున్నాయి.  ఈ ఒప్పందాల నుంచి బయటికి రావడానికి డిస్కమ్‌లకు వెసులుబా టు ఇస్తూ గత మార్చి 22న కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిని అనుసరిస్తూ గత జూలై 7న ఎన్టీపీసీ, ఎన్‌ఎల్‌సీతో చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు(పీపీఏ)ల నుంచి బయటికి రానున్నట్లు ఈఆర్‌సీలో డిస్కమ్‌లు పిటిషన్‌ చేశాయి. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అనంతరం ఒప్పందాల నుంచి వైదొలగడానికి డిస్కమ్‌లకు అనుమతినిస్తూ ఈఆర్‌సీ శనివారం ఉత్తర్వులు ఇచ్చింది.  

Updated Date - 2021-11-21T08:05:45+05:30 IST