మా వాటా నీటిని సరఫరా చేయండి

ABN , First Publish Date - 2021-01-20T08:41:29+05:30 IST

చెన్నై పట్టణ తాగునీటి కోసం కేటాయించిన నీటిని వెంటనే సరఫరా చేయాలని తమిళనాడు ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. చెన్నై తాగునీటి

మా వాటా నీటిని సరఫరా చేయండి

 కృష్టా బోర్డును కోరిన తమిళనాడు           


హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి) : చెన్నై పట్టణ తాగునీటి కోసం కేటాయించిన నీటిని వెంటనే సరఫరా చేయాలని తమిళనాడు ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. చెన్నై తాగునీటి అంశంపై కృష్ణా బోర్డు మంగళవారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. బోర్డు చైర్మన్‌ పరమేశం ఆధ్వర్యంలో జరిగిన ఈ వెబినార్‌ సమావేశంలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు పాల్గొన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 6.95 టీఎంసీల నీటిని మాత్రమే సరఫరా చేశారని, మిగిలిన నీటిని ఇంకా విడుదల చేయలేదని తమిళనాడు అధికారులు చెప్పారు. ఎండలు మొదలు కాకముందే మిగిలిన నీటిని కూడా విడుదల చేయాలని కోరారు.  తమ కోటా నీటిని నేరుగా తమిళనాడుకు సరఫరా చేయాలని, ఈ విషయమై తమను ఏటా అడగాల్సిన అవసరంలేదని కర్ణాటక, మహారాష్ట్ర అధికారులు చెప్పారు. చెన్నై తాగునీటి సరఫరా కమిటీ నుంచి కూడా తమను తొలగించాలని కోరారు. ఈ ఏడాది మిగిలిన నీటిని కూడా త్వరగా చెన్నైకు విడుదల చేయాలని ఏపీ అధికారులకు బోర్డు చైర్మన్‌ సూచించారు.

Updated Date - 2021-01-20T08:41:29+05:30 IST