ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు

ABN , First Publish Date - 2021-05-18T08:32:55+05:30 IST

స్పుత్నిక్‌ టీకా సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో డాక్టర్‌ రెడ్డీస్‌ చర్చలు జరుపుతోంది.

ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలతో చర్చలు

మే 17 (ఆంధ్రజ్యోతి): స్పుత్నిక్‌ టీకా సరఫరాకు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలతో డాక్టర్‌ రెడ్డీస్‌ చర్చలు జరుపుతోంది. ప్రస్తుతానికి మొత్తం 7-8 రాష్ట్రాలు స్పుత్నిక్‌ కొనుగోలుకు సంప్రదించినట్లు తెలుస్తోంది. వీటిలో ఏపీ, తెలంగాణలు కూడా ఉన్నాయని రమణ అన్నారు. ‘‘దేశ వ్యాప్తంగా టీకా సరఫరాకు శీతలీకరణ వ్యవస్థ, ఇతర సాధకబాధకాలను తెలుసుకోవడానికి ఈ పైలట్‌ ప్రాజెక్టును చేపట్టాం. మొదటి విడతలో దిగుమతి చేసుకున్న 1.5 లక్షల డోసులను ఈ కార్యక్రమంలో వినియోగించనున్నాం. హైదరాబాద్‌, విశాఖపట్నం తర్వాత పైలట్‌ ప్రాజెక్టును ఢిల్లీ, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై, కోల్‌కతా, పుణేలకు విస్తరిస్తాం’’ అని వివరించారు. దేశవ్యాప్తంగా మరిన్ని ఆస్పత్రులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. అపోలో హాస్పిటల్స్‌ నెట్‌వర్క్‌లోని ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ప్రారంభించనున్నట్లు అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (హాస్పిటల్స్‌ విభాగం) ప్రెసిడెంట్‌ కే హరి ప్రసాద్‌ తెలిపారు. ఆయా కంపెనీల ప్రాంగణాల్లో వ్యాక్సిన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి కార్పొరేట్‌ కంపెనీలతో అపోలో చర్చలు జరుపుతోందన్నారు. కాగా, స్పుత్నిక్‌ను స్థానికంగా తయారు చేయనున్న కంపెనీల్లో ఒకటైన హెటిరో ఫార్మాకు వ్యాక్సిన్‌పై క్లినికిల్‌ పరీక్షలకు అనుమతి లభించింది. మిగిలిన కంపెనీలు కూడా పరీక్షలకు అనుమతి పొందే ప్రక్రియలో ఉన్నాయి. ఈ పరీక్షలు నిర్వహించడానికి ఆయా కంపెనీలకు 42-45 రోజుల వ్యవధి పట్టే అవకాశముంది. 


Updated Date - 2021-05-18T08:32:55+05:30 IST