ఇంటర్ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ విద్యార్థుల ప్రతిభ
ABN , First Publish Date - 2021-12-17T08:41:37+05:30 IST
ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు.
ర్యాంకర్లను అభినందించిన విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి
కరీంనగర్ టౌన్, డిసెంబరు 16: ఇంటర్మీడియట్ ఫస్టియర్ ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించారు. ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 467 మార్కులతో మేకల కావేరి, వీ హేమశ్రీ, ఈ నవ్యశ్రీ, సిద్రాహైమాన్, ఏ సాయి ప్రణవి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచారని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్‌రెడ్డి తెలిపారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులను గురువారం ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంఈసీ విభాగంలో 500కు గాను 494 మార్కులతో లక్ష్మీనివాస్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించగా, వీ శ్రీనందిని, శ్రీచక్రిత 492 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను ఆకుల అర్చన, కోలా హారిక 437, ఈ సంకీర్తన 435 మార్కులు సాధించారని తెలిపారు. సీఈసీ విభాగంలో కీర్తివిద్యాధరణి 478, డీసాయిప్రసన్న 476 మార్కులు సాధించారని నరేందర్‌రెడ్డి చెప్పారు.