డబ్బులు వసూలు చేశాడని ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-01-13T04:08:52+05:30 IST

డబ్బులు వసూలు చేశాడని ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

డబ్బులు వసూలు చేశాడని ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

జనగామ కల్చరల్‌, జనవరి 12: స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న డి.రమేశ్‌ను సస్పెన్షన్‌ చేస్తూ డీఈవో ఎస్‌.యాదయ్య ఉత్తర్వులు జారీ చేశారు. అదే పాఠశాలలో హెచ్‌ఎంగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న రమేశ్‌ 2020లో జరిగిన పదో తరగతి పరీక్షల సందర్భంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆరోపిస్తూ ఎస్‌ఎంసీ చైర్మన్‌ రాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం ఆయన చర్యలీ చేపట్టారు. విచారణ ముగిసే వరకు హెడ్‌క్వార్టర్‌ వదలి వెళ్లరాదని ఆదేశించారు.

Updated Date - 2021-01-13T04:08:52+05:30 IST