సుశీల్‌ సేఫ్‌

ABN , First Publish Date - 2021-06-20T09:49:24+05:30 IST

యశోద ఆస్పత్రి వైద్యుల కృషి, సోనూసూద్‌ చొరవతో తెలంగాణ బాడీ బిల్డర్‌ సుశీల్‌ కుమార్‌ (32) క్షేమంగా బయట పడ్డారు.

సుశీల్‌ సేఫ్‌

సోనూసూద్‌ చొరవతో బయటపడిన బాడీ బిల్డర్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): యశోద ఆస్పత్రి వైద్యుల కృషి, సోనూసూద్‌ చొరవతో తెలంగాణ బాడీ బిల్డర్‌ సుశీల్‌ కుమార్‌ (32) క్షేమంగా బయట పడ్డారు. బ్యాక్టీరియల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తోపాటు, సీటీ స్కోర్‌ 25/25తో దాదాపు 20 రోజుల పాటు వెంటిలేటర్‌పై ఉన్న బాడీ బిల్డర్‌కు అరుదైన చికిత్స అందించి సాధారణ స్థితికి తీసుకురావడానికి వైద్యులు కృషి చేశారు. కరోనాబారిన పడిన సుశీల్‌ ఆరోగ్యం క్షీణించడంతో మలక్‌పేట యశోద ఆస్పత్రికి వచ్చారని డైరెక్టర్‌ డాక్టర్‌ పవన్‌ గోరుకంటి వివరించారు. సుదీర్ఘ చికిత్స తర్వాత ఆయన సాధారణ స్థితికి చేరినట్లు పల్మనాలజిస్టు డాక్టర్‌ విశ్వేశ్వరన్‌ బాలసుబ్రమణియన్‌ తెలిపారు. అతని క్రీడా నేపథ్యం తెలుసుకున్న సినీనటుడు సోనుసూద్‌ యశోద ఆస్పత్రికి తరలించడంలో ప్రత్యేక చొరవ తీసుకున్నారని, ఆయన సహాయం చాలా గొప్పదని డాక్టర్‌ పవన్‌ తెలిపారు. 

Updated Date - 2021-06-20T09:49:24+05:30 IST