Suryapeta: పులిచింతల ప్రాజెక్ట్ 9 గేట్లు ఎత్తివేత
ABN , First Publish Date - 2021-10-11T13:36:58+05:30 IST
పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.
సూర్యాపేట: పులిచింతల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ప్రాజెక్ట్‌లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. అధికారులు ప్రాజెక్ట్ తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. పులిచింతల ఇన్ ఫ్లో: 1,04,378 క్యూసెక్కులుగా ఉండగా, అవుట్ ఫ్లో: 1,01,347 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలుగా ఉండగా, ప్రస్తుత నీటి సామర్థ్యం 33.18 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 166.205 అడుగులుగా ఉంది.