లాలుతండా సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్
ABN , First Publish Date - 2021-03-25T05:25:26+05:30 IST
లాలుతండా సర్పంచ్‌ను సస్పెండ్ చేసిన కలెక్టర్

కేసముద్రం, మార్చి 24 : శ్మశానవాటిక నిర్మాణం చేయకుండా నిధులు డ్రా చే సుకున్నందుకు మండలంలోని ఇనుగుర్తి శివారు లాలుతండా సర్పంచ్ బానోత్ రా మన్నను ఆరునెలల పాటు సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారని ఎంపీడీవో రోజారాణి బుధవారం తెలిపారు. శ్మశానవాటిక నిర్మాణంలో అలసత్వం వహించడంపై గతంలో సర్పంచ్‌కు నోటీసు పంపగా అటవీశాఖ అభ్యంతరాలుండడంతో ఆలస్యం జరిగిందని, త్వరలోనే పూర్తి చేస్తామని వివరణ ఇచ్చిన ట్లు తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణం కోసం డీఎంఎ్‌ఫటీ నిధుల నుంచి రూ.2లక్షలను డ్రా చేసుకొని పని ప్రారంభించకపోవడంతో ఆరు నెలలపాటు సస్పెన్షన్ విధించినట్లు చెప్పారు.
సర్పంచ్‌లకు షోకాజ్‌లు..
శ్మశానవాటికల నిర్మాణాల్లో అలసత్వంపై మండలంలోని అయ్యగారిపల్లి, రం గాపురం, చీన్యాతండా, సప్పిడిగుట్టతండా సర్పంచులకు కలెక్టర్ షోకాజ్ నోటీసు లు జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. నిర్మాణంలో అలసత్వం వహించడంపై చర్యలు ఎందుకు తీసుకోకూడదనే కారణాలను తెలపాలని నోటీసులు పంపారు.