తెలుగు అకాడమీ విభజన త్వరగా తేల్చండి

ABN , First Publish Date - 2021-08-10T08:12:22+05:30 IST

తెలుగు అకాడమీ ఆస్తులు, అప్పుల విభజనను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. తెలుగు

తెలుగు అకాడమీ విభజన త్వరగా తేల్చండి

తెలంగాణ, ఏపీలకు సుప్రీం ఆదేశాలు


న్యూఢిల్లీ, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): తెలుగు అకాడమీ ఆస్తులు, అప్పుల విభజనను త్వరగా పూర్తి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది. తెలుగు అకాడమీ విభజన కానందున 2019 నుంచి తమకు వేతనాలు అందడం లేదంటూ గతంలో పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు హైకోర్టుకు వెళ్ళారు. విభజన చట్టం ప్రకారం అకాడమీ ఆస్తులు, అప్పులు, ఉద్యోగుల విభజనకు రెండు నెలల్లో మార్గదర్శకాలు రూపొందించి, మూడు నెలల్లో విభజన ప్రక్రియ చేపట్టాలని జనవరిలో తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ తెలం గాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సోమవారం ద్విసభ్య ధర్మాసనం విచారించింది.  తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. 

Updated Date - 2021-08-10T08:12:22+05:30 IST