అనుబంధ చార్జిషీటు చెల్లదు..

ABN , First Publish Date - 2021-12-25T07:42:44+05:30 IST

ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి పెన్నా

అనుబంధ చార్జిషీటు చెల్లదు..

జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో నిందితురాలు ఐఏఎస్‌ శ్రీలక్ష్మి వాదనలు

హైదరాబాద్‌, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం జగన్‌ అక్రమాస్తుల వ్యవహారానికి సంబంధించి పెన్నా సిమెంట్స్‌ కేసులో తనను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ దాఖలు చేసిన అనుబంధ చార్జిషీటు చట్ట ప్రకారం చెల్లదని ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మి పేర్కొన్నారు. జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన సీబీఐ కేసులను కొట్టివేయాలని కోరుతూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం శుక్రవారం విచారణ కొనసాగించింది. శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పెన్నా సిమెంట్స్‌కు కేటాయించిన భూములకు.. అప్పటి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా ఉన్న శ్రీలక్ష్మికి ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. ఆమెపై నమోదైన కేసును కొట్టివేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. కాగా.. తదుపరి విచారణ ఈ నెల 27కు వాయిదా పడింది. 


Updated Date - 2021-12-25T07:42:44+05:30 IST