10 నుంచి హెచ్‌సీయూకు వేసవి సెలవులు

ABN , First Publish Date - 2021-05-08T08:49:22+05:30 IST

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది.

10 నుంచి హెచ్‌సీయూకు వేసవి సెలవులు

రాయదుర్గం, మే 7 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) ఈ నెల 10 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది.  వర్సిటీ వైస్‌చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ పొదిలె అప్పారావు శుక్రవారం డీన్లు, పలు విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మేరకు ముందస్తుగా ఈ నెల మే 10 నుంచి జూన్‌ 8 వరకు వర్సిటీ వేసవి సెలవులు ప్రకటించింది.  రెండురోజుల్లో విద్యార్థులు హాస్టల్స్‌ను ఖాళీ చేసి వెళ్లాలని అధికారులు తెలిపారు. జూలై 20, 21 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వచ్చే సెమిస్టర్‌ తరగతులు ఆగస్టు 2 నుంచి ప్రారంభమవుతాయన్నారు. 

Updated Date - 2021-05-08T08:49:22+05:30 IST