తమ్ముడు కొట్టాడని అన్న ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-02-01T08:37:01+05:30 IST
తమ్ముడు కొట్టాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా అమనగల్‌లో జరిగింది. అమనగల్‌కు చెందిన అక్కెనపల్లి పెద్ద వెంకన్న (55)కు అమనగల్ శివారులో 4.31 ఎకరాల సాగు భూమి

మహబూబాబాద్ రూరల్, జనవరి 31: తమ్ముడు కొట్టాడనే మనస్తాపంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా అమనగల్‌లో జరిగింది. అమనగల్‌కు చెందిన అక్కెనపల్లి పెద్ద వెంకన్న (55)కు అమనగల్ శివారులో 4.31 ఎకరాల సాగు భూమి ఉంది. రెండు రోజుల క్రితం వ్యవసాయ బావి వద్ద మోటారు బోరు విషయంలో వెంకన్నకు అతడి తమ్ముడు అక్కెనపల్లి పాపులుతో ఘర్షణ జరిగింది. పాపులు, అతడి కుమారుడు సంతోష్ కలిసి వెంకన్నపై దాడి చేశారు. దీంతో వెంకన్న ఆదివారం ఉదయం వ్యవసాయ క్షేత్రంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.