ఇన్‌చార్జి సర్పంచ్ దూషించారని ఆత్మహత్యాయత్నం
ABN , First Publish Date - 2021-10-21T05:44:19+05:30 IST
ఇన్‌చార్జి సర్పంచ్ దూషించారని ఆత్మహత్యాయత్నం

చిట్యాల, అక్టోబరు 20: ఇన్‌చార్జి సర్పంచ్ దూషించారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కు టుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వెంకట్రావుపల్లి కాలనీలో మంగళవారం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. తన సొంత భూమి మీదుగా పనులు చేపడుతున్నా రంటూ మటిక సాంబశివరావు అనే వ్యక్తి అ భ్యంతరం చెప్పాడు. ఈ క్రమంలో ఇన్‌చార్జి స ర్పంచ్ కోపోద్రిక్తుడై సాంబశివరావును అసభ్య పదజాలంతో దూషించాడని, దీంతో అవమాన భారంతో అతడు అదే రోజు రాత్రి పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న సాం బశివరావును ఆస్పత్రిలో చేర్పించామని చెప్పారు. ఈ ఘటనపై విచారణ చేప డుతున్నామని ఎస్సై సూర్యనారాయణ తెలిపారు.