బాలికను గర్భవతిని చేసిన యువకుడు

ABN , First Publish Date - 2021-03-22T05:12:13+05:30 IST

బాలికను గర్భవతిని చేసిన యువకుడు

బాలికను గర్భవతిని చేసిన యువకుడు

కేసు అవుతుందేమోనని ఆత్మహత్యాయత్నం

హన్మకొండ టౌన్‌, మార్చి 21 : బాలికను లోబర్చుకుని గర్భవతిని చేసిన ఓ యువకుడు.. పోలీసులు కేసు పెడతారేమోనని భయపడి కేయూ పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన ఈ సంఘటనపై సీఐ జనార్దన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హసన్‌పర్తి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన ఓదెల సతీష్‌ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలికను  లోబరుచుకుని గర్భవతిని చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆదివారం గ్రామంలో సతీష్‌ కుటుంబ సభ్యులను నిలదీశారు. దీంతో ఇరుకుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి సతీష్‌ను, అతడి తల్లిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు. అయితే కేసు పెడతారనే భయంతో స్టేషన్‌ ఆవరణలో సతీష్‌ బ్లేడుతో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. అప్రమత్తమైన పోలీసులు సతీ్‌షను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ జనార్దన్‌రెడ్డి తెలిపారు. 


Updated Date - 2021-03-22T05:12:13+05:30 IST