భర్త మృతితో కుంగిపోయి.. ఐదేళ్ల బిడ్డతోసహా భార్య ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-08-27T10:25:04+05:30 IST

భర్త మృతితో మానసికంగా కుంగిపోయిన భార్య బిడ్డతోసహా ఆత్మహత్య చేసుకొంది. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..

భర్త మృతితో కుంగిపోయి.. ఐదేళ్ల బిడ్డతోసహా భార్య ఆత్మహత్య

పటాన్‌చెరు, ఆగస్టు 26: భర్త మృతితో మానసికంగా కుంగిపోయిన భార్య బిడ్డతోసహా ఆత్మహత్య చేసుకొంది. పటాన్‌చెరు సీఐ వేణుగోపాల్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కల్హేర్‌ మండలం కడ్పల్‌ గ్రామానికి చెందిన చవితోళ్ల వింధ్య(35).. మహేశ్వర మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తూ పటాన్‌చెరులో నివశిస్తోంది. ఆమె భర్త దేవదాస్‌ గతేడాది ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకొన్నాడు. భర్త మృతితో.. దిక్కులేని వాళ్లమయ్యామని ఆమె మానసికంగా బాధపడుతుండేది. గురువారం కుమార్తె ఐదేళ్ల వింధ్యతో కలిసి పట్టణంలోని సాకిచెరువు వద్దకు వచ్చింది. బిడ్డను గట్టిగా పట్టుకొని చెరువులోకి దూకింది. కొన్ని గంటల తర్వాత వింధ్య మృతదేహం నీటిపై తేలింది. స్థానికుల సమాచారంతో పోలీ్‌సలు అక్కడికి వచ్చారు. మృతదేహాన్ని బయటకు తీయించారు. తల్లీకూతుళ్ల మృదేహాలు చూసిన అక్కడి వాళ్లకు కన్నీళ్లు ఆగలేదు. తల్లి కౌగిలిలోనే ఆ చిన్నారి ఉంది.  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.

Updated Date - 2021-08-27T10:25:04+05:30 IST