తండ్రి మందలించినందుకు..

ABN , First Publish Date - 2021-01-14T04:45:57+05:30 IST

తండ్రి మందలించినందుకు..

తండ్రి మందలించినందుకు..

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

నర్మెట, జనవరి 13: వ్యాపారాన్ని నష్టాలపాలు చేస్తున్నావని తండ్రి మందలించినందుకు మనస్తాపంతో కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. జనగామ జిల్లా నర్మెట పోలీసుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా తారకరామనగర్‌కు చెందిన షెక్‌ చాంద్‌- ఆఫ్రిన్‌ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. వీరు కుటుంబ  పోషణ కోసం చిలుపూర్‌ మండలం ఫత్తేపూర్‌ గ్రామానికి వచ్చి చుట్టు పక్కల ఉన్న సంతల్లో పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. అయితే పెద్ద కుమారుడు షెక్‌ షాషిద్‌(17) పండ్ల వ్యాపారంలో రెండు మూడు నెలల నుంచి నష్టం తీసుకువస్తున్నాడు. దీంతో తండ్రి షెక్‌ చాంద్‌ అనేకమార్లు మందలించాడు. ఈ క్రమంలో బుధవారం నర్మెటలో సంత ఉండడంతో కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చారు. సంతలో అందరిముందు తండ్రి మరోసారి మందలించడంతో మనస్తాపం చెందిన షాహిద్‌ బహిర్భూమికి వెళ్లి వస్తానని చెప్పి సంత చివరలో ఉన్న చింత చెట్టుకు ఉరి వేసుకున్నాడు. రెండు గంటలైనా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి వెతకగా చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. ఎస్సై శ్రీనివాస్‌  కేసు దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2021-01-14T04:45:57+05:30 IST