అపార్టుమెంట్‌పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-10-28T05:30:59+05:30 IST
అపార్టుమెంట్‌పై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

కరోనాతో తల్లిదండ్రుల మృతితో మనోవేదన
మట్టెవాడ, అక్టోబరు 27: కరోనాతో తల్లిదండ్రులు మృతి చెందడంతో తీవ్ర మనోవేదనకు గురైన యువకుడు బుధ వారం రాత్రి అపార్టుమెంట్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వరంగల్ జిల్లా కేంద్రంలోని కొత్తవాడ పోచమ్మమైదాన్‌లో చోటుచేసుకుంది. బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ కొత్తవాడలోని ఏఎన్‌ఆర్ వైష్ణవీ ఎన్‌క్లేవ్ అపార్టుమెంట్‌లో మూడో అం తస్తులో ఉంటున్న ఇలసారపు నాగరాజు (22) బుధవారం రాత్రి 9గంటల ప్రాంతంలో అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. వెంటనే స్థానికులు, బంధువులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలిం చగా, వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. నాగరాజు తల్లిదండ్రులు దామోదర్, విజయలక్ష్మి దంపతులకు నాగరాజు ఒక్కడే కుమారుడు. దామోదర్ నగరంలో ఓ బార్‌ను నిర్వహిస్తున్నాడు. నాగరాజు డిగ్రీ చదవి, బార్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్నాడు. కాగా దామోదర్, విజయలక్ష్మి ఇద్దరూ గత మే నెలలో కరోనాతో మృతిచెందారు. తల్లిదండ్రుల మరణంతో ఒంటరివాడైన నాగరాజు తీవ్ర మనోవేదనకు గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా మూడు నెలల క్రితం కూడా నిద్ర మాత్రలు వేసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. నాగరాజు బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మట్టెవాడ పోలీసులు తెలిపారు.