అన్నకు భారం కాకూడదని..

ABN , First Publish Date - 2021-02-07T04:45:14+05:30 IST

అన్నకు భారం కాకూడదని..

అన్నకు భారం కాకూడదని..
ప్రణీత(ఫైల్‌)

శాయంపేటలో యువతి ఆత్మహత్య

శాయంపేట, ఫిబ్రవరి 6: తన పెళ్లి సోదరుడిపై భారం పడుతుందని మనస్థాపంతో మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి ప్రణీత(27) శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన దైనంపెల్లి ప్రవీణ్‌ గ్రామ పంచాయతీలో మల్టీ పర్పస్‌ వర్కర్‌గా పని చేస్తున్నాడు. తల్లిదండ్రులు కొన్నేళ్ల కిందట మృతి చెందారు. ప్రవీణ్‌కు ఇద్దరు చెల్లెళ్లు. పెద్ద చెల్లెలు వివాహం కాగా, చిన్నచెల్లి ప్రణీత వివాహం కోసం పొలం అమ్మి వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. పొలం అమ్మితే అన్న ఆర్థిక ఇబ్బందులకు గురవుతాడని భావించిన ప్రణీత.. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో దూలానికి ఉరి వేసుకుంది. ప్రవీణ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


Updated Date - 2021-02-07T04:45:14+05:30 IST