ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-11-21T08:08:47+05:30 IST

ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి హాస్టల్‌ గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని జేబీఐఈటీ ఇంజనీరింగ్‌..

ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య

యాజమాన్య వేధింపులే కారణం: విద్యార్థి సంఘాల ఆరోపణ


మెయినాబాద్‌ రూరల్‌, నవంబరు 20: ఇంజనీరింగ్‌ కళాశాల విద్యార్థి హాస్టల్‌ గదిలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని జేబీఐఈటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన గజ్జల కృష్ణ విజయభాస్కరరాజు(20) బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. భాస్కరరాజు మృతికి కళాశాల యాజమాన్య వేధింపులే కారణమని విద్యార్థులు ఆందోళన చేశారు. తమ కుమారుడి మృతిపై అనుమానా లు ఉన్నాయని, విచారణ జరపాలని తండ్రి తిరుపతయ్య ఫిర్యాదు చేశారు. యాజమాన్యాన్ని వివరణ కోరగా.. అతను మెరిట్‌ స్టూడెంట్‌ కావడంతో ఎ లాంటి ఫీజు లేకుండానే తమ కళాశాలలో చేర్చుకున్నట్లు తెలిపారు. వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతుంటే చికిత్స చేయించినట్లు చెప్పారు.

Updated Date - 2021-11-21T08:08:47+05:30 IST