శంషాబాద్‌ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు

ABN , First Publish Date - 2021-12-09T07:34:09+05:30 IST

శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు

శంషాబాద్‌ రూరల్‌, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కఠిన ఆంక్షలు విధించారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ పలు దేశాల్లో విజృంభిస్తున్న నేపథ్యంలో జీఎంఆర్‌ ఎయిర్‌పోర్టు అధికారులు తాజాగా మార్గదర్శకాలు విడుదల చేశారు. ఆ వివరాలను జీఎంఆర్‌ సీఈవో ప్రదీప్‌ ఫణీకర్‌ బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రయాణికుల కోసం అంతర్జాతీయ అరైవల్‌ గేటు వద్ద కొవిడ్‌ పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. నివేదికల కోసం వేచి ఉన్న ప్రయాణికులకు ప్రత్యేక వసతులు కల్పించామని, ఇమిగ్రేషన్‌ ప్రాంతంలో సమాచార సహాయ సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు.


ఇక.. గడచిన వారంరోజుల్లో 1,908 మంది అంతర్జాతీయ ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారని, వారిలో 13 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని ఆయన తెలిపారు. జీనోమ్‌ సీన్వెన్సిం గ్‌ అనంతరం ఎవరికీ ఒమైక్రాన్‌ వేరియంట్‌ సోకినట్లు వెల్లడి కాలేదన్నారు.


Updated Date - 2021-12-09T07:34:09+05:30 IST