18 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె

ABN , First Publish Date - 2021-05-21T08:28:35+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్‌ 18 నుంచి సమ్మె ప్రారంభిస్తామని గాంఽధీ ఆస్పత్రి జూనియర్‌ వైద్యుల

18 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె

‘గాంధీ’ జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు మణికుమార్‌


అడ్డగుట్ట, మే 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న జూనియర్‌ డాక్టర్ల డిమాండ్లను పరిష్కరించకపోతే జూన్‌ 18 నుంచి సమ్మె ప్రారంభిస్తామని గాంఽధీ ఆస్పత్రి జూనియర్‌ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ వనం మణికుమార్‌ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌ బుధవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించినప్పుడు తాము జూనియర్‌ వైద్యుల డిమాండ్ల పత్రాన్ని సమర్పించడానికి యత్నించినా వాటిని తీసుకోలేదన్నారు.  ప్రభుత్వ ఆస్పత్రుల్లో జూడాలు సమ్మె చేయవద్దని సీఎం సూచించి, తమ చాంబర్‌కు పిలిపించి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తానన్నారని చెప్పారు. రెండు రోజులు అవుతున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి పిలుపు రాలేదన్నారు. జీతాల విషయంలో కొన్నేళ్లుగా కొనసాగుతోన్న జాప్యంపై ఇక ఉపేక్షించేది లేదని చెప్పారు.

Updated Date - 2021-05-21T08:28:35+05:30 IST