రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి: డీకే అరుణ
ABN , First Publish Date - 2021-11-06T01:21:41+05:30 IST
కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన రీతిలోనే రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంత తగ్గింపు ప్రకటించాలని బీజేపీ జాతీయ

గద్వాల: కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించిన రీతిలోనే రాష్ట్రంలో కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కొంత తగ్గింపు ప్రకటించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణంలోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. అన్ని రాష్ర్టాలు కేంద్ర ప్రభుత్వం బాటలోనే డీజిల్, పెట్రోలు ధరల తగ్గింపునకు కొంత రాయితీ ప్రకటించగా ఇప్పటికీ రాష్ట్రంలో తగ్గించకపోవడం సరికాదన్నారు. ప్రజా రవాణా అయిన ఆర్టీసీలో టికెట్ రేట్లను పెంచాలని ప్రయత్నించడం దుర్మార్గపు ఆలోచన అన్నారు. మద్యపానంపై వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను నడపాలనుకోవడం దౌర్భాగ్యమన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు కేసీఆర్‌కు చెంపపెట్టు వంటిదన్నారు. వేల కోట్లు గుమ్మరించి మద్యాన్ని ఏరులై పారించి, పథకాలతో ప్రలోభ పెట్టినా ప్రజలు తిరస్కరించడాన్ని కేసీఆర్ గుణపాఠంగా తీసుకోవాలని అరుణ చెప్పారు.