గురువులకు జేజేలు
ABN , First Publish Date - 2021-09-04T05:15:24+05:30 IST
గురువులకు జేజేలు

ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 11 మందికి ఉత్తమ టీచర్ అవార్డులు
ఓసిటీ(వరంగల్), సెప్టెంబరు 3: సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచి వివిధ విభాగాల్లో ఆరుగురు ఉపాధ్యాయులు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. ప్రధానోపాధ్యాయుల విభాగంలో కాశీబుగ్గలోని నరేంద్రనగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుంట రవికుమార్ ఎంపిక అయ్యారు. స్కూల్ అసిస్టెంట్ల విభాగంలో ఐనవోలు మండలంలోని పున్నేలు జడ్‌పీహెచ్‌ఎ్‌సలో స్కూల్ అసిస్టెంట్(ఫిజికల్ సైన్స్)గా పనిచేస్తున్న పి.సురే్‌షబాబు, శాయంపేట మండలం జడ్‌పీహెచ్‌ఎ్‌స గట్లకనపర్తిలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్) బి.మధు, చర్లపల్లిలోని జడ్‌పీహెచ్‌ఎ్‌స స్కూల్ అసిస్టెంట్(ఇంగ్లీష్) డాక్టర్ కె.శ్రీనివాస్ రెడ్డి ఎంపికయ్యారు. ఎస్జీటీ విభాగంలో ముప్పారం ఎంపీపీఎస్ ఎస్జీటీ పి.సమ్మయ్య ఎంపిక కాగా, స్పెషల్ కేటగిరీ విభాగంలో గీసుకొండ మండలంలోని గొర్రెకుంట జడ్‌పీహెచ్‌ఎ్‌సలో స్కూల్ అసిస్టెంట్(మ్యాథ్స్)గా పనిచేస్తున్న టి.నిహారిక ఎంపికయ్యారు. వీరి ఎంపికపై ఉభయ జిల్లాల డీఈవోలు డి.వాసంతి, కె.నారాయణరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం ఇటికాలపల్లిలో బయాలజికల్ సైన్స్ టీచర్ గౌసియాబేగం, జనగామ మండలం వడ్లకొండ ఎంపీపీఎస్ ఎస్‌జీటీ మేర్గు రామరాజు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. మహబూబాబాద్ మండలం ముడుపుగల్ ప్రాథమిక పాఠశాలలో
సెకండరీ గ్రేడ్ టీచర్‌గా (ఎస్‌జీటీ) విధులు నిర్వర్తిస్తున్న సునీత ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికయ్యారు.
కేయూ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు..
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ నుంచి ఇద్దరు ప్రొఫెసర్లు రాష్ట్ర ఉత్తమ అధ్యాపకులుగా ఎంపికయ్యారు. కేయూ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హెచ్‌ఆర్‌ఎం విభాగం ప్రొఫెసర్ తోపుచర్ల యాదగిరిరావు, కేయూ గణితశాస్త్ర విభాగం సీనియర్ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డిలు ఎంపికయారు. సెప్టెంబరు 4న హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో వీరు హాజరవుతారు. అనంతరం సెస్టెంబర్ 5న హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగే ఉపాధ్యాయ దినోత్సవ వేడకల్లో మఖ్యమంత్రి కేసీఆర్ చేతులు మీదుగా వీరు అవార్డులను స్వీకరిస్తారు.