దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోం.. జగన్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

ABN , First Publish Date - 2021-06-21T23:08:50+05:30 IST

దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోం.. జగన్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

దౌర్జన్యం చేస్తామంటే ఊరుకోం.. జగన్‌పై శ్రీనివాస్ గౌడ్ ఫైర్

హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం చేస్తున్న నీటి దోపిడీని వ్యతిరేకిస్తున్నామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దాని‌పై కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. వైఎస్ కాలంలో రాజోలు బండ దగ్గర తూములు పగలకొట్టి నీళ్లు దోచుకుపోయారని గుర్తు చేశారు. ఇప్పుడు జగన్ 80 వేల క్యూసెక్కులు తీసుకుపోతున్నారని ఆరోపించారు. పాలమూరు ప్రజలు బ్రతుకొద్దా.. నీళ్లోద్దా అని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఉల్లంగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం అనుమతిలేకుండానే రాయలసీమ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్‌ది నిజమైన స్నేహం కాదన్నారు. జగన్ వైఖరి నోట్లో చక్కెర, కడుపులో కత్తెర అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లా కృష్ణా బేసిన్‌లో ఉందా?, పెన్నా బేసిన్‌లో ఉందా? అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాకు నీరు తీసుకువెళతామని ఏపీ మంత్రి ఎలా చెబుతారని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఎగువన ఉందని, ఏపీలో ఒకటి కడితే ఇక్కడా పది కడతామని ఆయన హెచ్చరించారు. పైనుంచి నీళ్లను మలుపు కోవడం తమకు తెలియదా అని ప్రశ్నించారు. దౌర్జన్యం చేస్తామంటే తాము ఊరుకోమని శ్రీనివాస్ హెచ్చరించారు.

Updated Date - 2021-06-21T23:08:50+05:30 IST