హోలీ పండగకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-03-21T15:39:55+05:30 IST

హోలీ పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ..

హోలీ పండగకు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ : హోలీ పండగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం సికింద్రాబాద్‌-గోరక్‌పూర్‌, హైదరాబాద్‌-రక్సోల్‌ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్యరైల్వే అధికారులు తెలిపారు.


  • సికింద్రాబాద్‌-గోరక్‌పూర్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07003) ఈనెల 25వ తేదీ గురువారం రాత్రి 9.25గంటలకు బయల్దేరి, శనివారం ఉదయం 6.25గంటలకు గోరక్‌పూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో గోరక్‌పూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07004) గోరక్‌పూర్‌ నుంచి ఈ నెల 30వ తేదీ మంగళవారం సాయంత్రం 5.25 గంటలకు బయల్దేరి, గురువారం తెల్లవారుజామున 4.10గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 

  • హైదరాబాద్‌-రక్సోల్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07040) హైదరాబాద్‌ నుంచి ఈ నెల 24వ తేదీ బుధవారం రాత్రి 9.40గంటలకు బయల్దేరి, శుక్రవారం సాయంత్రం 4.50గంటలకు రక్సోల్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రక్సోల్‌-హైదరాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07039) రక్సోల్‌ నుంచి ఈ నెల 31వ తేదీ బుధవారం తెల్లవారుజామున 3.25గంటలకు బయల్దేరి, గురువారం రాత్రి 10.15గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది.

Updated Date - 2021-03-21T15:39:55+05:30 IST