హైదరాబాద్‌- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2021-12-17T08:24:59+05:30 IST

శీతాకాలం సెలవులు, క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు కాకినాడ టౌన్‌- లింగంపల్లి (హైదరాబాద్‌), లింగంపల్లి - కాకినాడ టౌన్‌, హైదరాబాద్‌-జైపూర్‌, జైపూర్‌- హైదారాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్‌- కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు

శీతాకాలం సెలవులు, క్రిస్మస్‌ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు  కాకినాడ టౌన్‌- లింగంపల్లి (హైదరాబాద్‌), లింగంపల్లి - కాకినాడ టౌన్‌,  హైదరాబాద్‌-జైపూర్‌, జైపూర్‌- హైదారాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. కాకినాడ టౌన్‌ -లింగంపల్లి మధ్య ఈనెల 22, 25, 27, 29 తేదీల్లో(నంబరు-07275), అదేవిధంగా లింగంపల్లి - కాకినాడ టౌన్‌ మధ్య  ఈనెల 23, 26, 28, 30 తేదీల్లో నాలుగు  ప్రత్యేక రైళ్లు (నెంబరు- 07276) నడవనున్నట్టు  రైల్వే అధికారులు తెలిపారు.  కాగా, హైదరాబాద్‌-జైపూర్‌ల మధ్య ఈనెల 26 నుంచి 2022 జనవరి 4 వరకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. . 

Updated Date - 2021-12-17T08:24:59+05:30 IST