దీపావళికి పూణె-తిరుపతి స్పెషల్‌ రైలు

ABN , First Publish Date - 2021-10-26T05:09:32+05:30 IST

దీపావళికి పూణె-తిరుపతి స్పెషల్‌ రైలు

దీపావళికి పూణె-తిరుపతి స్పెషల్‌ రైలు

కాజీపేట, అక్టోబరు 25 : దీపావళి పండుగ రద్దీ దృష్ట్యా నవంబరు 1వ తేదీ నుంచి కాజీపేట మీదుగా పూణె-తిరుపతి స్పెషల్‌ రైలును నడపనున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు. నవంబరు 1, 8, 15, 22, 29 తేదీల్లో పూణె-తిరుపతి(07607) స్పెషల్‌ రైలు ప్రతీ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు పూణెలో బయలుదేరి కాజీపేటకు రాత్రి 9.05 గంటలకు చేరుకుంటుంది. తిరుపతికి మంగళవారం ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది. తిరుపతి-పూణె(07608) స్పెషల్‌ రైలు నవంబరు 2, 9, 16, 23, 30 తేదీల్లో ప్రతి మంగళవారం తిరుపతిలో రాత్రి 8.15 గంటలకు బయలుదేరి బుధవారం ఉదయం 4.50 గంటలకు కాజీపేటకు చేరుకుంటుంది. పూణె రైల్వేస్టేషన్‌కు సాయంత్రం 3.25 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలుకు నాందేడ్‌, ముద్కేడ్‌, ధర్మాబాద్‌, బాసర, నిజామాబాద్‌, కామారెడ్డి,  మేడ్చల్‌, సికింద్రాబాద్‌, కాజీపేట, వరంగల్‌, మహబూబాబాద్‌, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, నెల్లూరు, గూడూర్‌, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో హాల్టింగ్‌ సౌకర్యం కల్పించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Updated Date - 2021-10-26T05:09:32+05:30 IST