జేఎన్టీయూ విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ

ABN , First Publish Date - 2021-02-26T08:03:48+05:30 IST

జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో నాలుగేళ్ల బీటెక్‌ చేసిన అనంతరం బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారు..

జేఎన్టీయూ విద్యార్థులకు ప్రత్యేక సప్లిమెంటరీ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ)లో నాలుగేళ్ల బీటెక్‌ చేసిన అనంతరం బ్యాక్‌లాగ్స్‌ ఉన్నవారు.. వాటిని పూర్తిచేసేందుకు అదనంగా నాలుగేళ్ల సమయం ఉంటుంది. ఈ వ్యవధిలో పూర్తిచేయనివారు ఆ పట్టాను పొందలేరు. ఇలా గరిష్ఠ గడువు ముగిసినా ఉత్తీర్ణులు కానివారు రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటారు. వారందరికీ జేఎన్టీయూ అవకాశం కల్పిస్తోంది. 1972 నుంచి 2010మధ్యలో ఉత్తీర్ణులు కాని వారందరూ ఈ పరీక్షలు రాయొచ్చు. 

Updated Date - 2021-02-26T08:03:48+05:30 IST