చిన్నారులతో క్రికెట్ ఆడిన స్పీకర్
ABN , First Publish Date - 2021-08-25T23:19:57+05:30 IST
రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. తన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ

బాన్సువాడ: రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి చిన్నారులతో కలిసి సరదాగా క్రికెట్ ఆడారు. తన స్వగ్రామమైన కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం గ్రామానికి ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు స్పీకర్ బుధవారం వెళ్లారు. తిరిగి బాన్సువాడకు వస్తుండగా మార్గమధ్యలో దేశాయిపేట్ గ్రామ కూడలి వద్ద క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూడగానే స్పీకర్ పోచారం తన వాహనాన్ని ఆపారు. ఈ సందర్భంగా కాసేపు చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు.