కొవిడ్‌ను జయించాలి..
ABN , First Publish Date - 2021-05-20T05:39:16+05:30 IST
కొవిడ్‌ను జయించాలి..

ఎస్పీ సంగ్రామ్‌సింగ్
ములుగు, మే 19: క్రమశిక్షణ., జాగ్రత్తలు పాటిస్తూ కరోనా వైర్‌సను జయించాలని ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ అన్నారు. ఈమేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. మొదటి దశలో కరోనాను సమర్థంగా ఎదుర్కోగలిగామని, అదే స్ఫూర్తితో రెండో దశను దాటేందుకు ప్రభుత్వం, యంత్రాంగానికి సహకరంచాలని కోరారు. రెండో విడతలో వైరస్ ఉధృతి అధికంగా ఉందని, చాలా మందిని బలితీసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్తు నుంచి గట్టేక్కేందుకు లాక్‌డౌన్ దోహదపడుతుందని, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని పేర్కొన్నారు. నిత్యావసరాలను కొనుగోలు చేసేందుకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఇచ్చిన వెసులుబాటును దుర్వినియోగం చేయొద్దని సూచించారు. బయటకు వస్తే కచ్చితంగా మాస్కు ధరించడంతోపాటు భౌతికదూరం పాటించాలని పేర్కొన్నారు. అయితే చాలామంది నిబంధనలు పాటించకపోడంతో వైర్‌సకు గురికావాల్సి వస్తోందని తెలిపారు. కచ్చితంగా 10గంటలకు ప్రతీ దుకాణం మూసివేయాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.