త్వరలో కాపు కులాల జేఏసీ ఏర్పాటు
ABN , First Publish Date - 2021-09-14T11:54:57+05:30 IST
కాపు కులాలన్నింటినీ ఐక్యంచేసి త్వరలో కాపు గర్జనను...
హైదరాబాద్ సిటీ/రాంనగర్ : కాపు కులాలన్నింటినీ ఐక్యంచేసి త్వరలో కాపు గర్జనను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనిర్వహిస్తున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు తాడివాక రమేష్‌నాయుడు వెల్లడించారు. కాపు యువసేన, కాపునాడు, కాపు మహా సభల సంయుక్త ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి,మున్నూరుకాపుల జేఏసీలను ఏర్పాటు చేసి, తెలుగు రాష్ట్రాల్లో కాపులను బలోపేతం చేసి సత్తాచాటేందుకు ప్రయత్నాలు ము మ్మరం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం బాగ్‌లింగంపల్లిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కాపుల్లో ఐక్యత, వివక్షకు గురైన కాపు కులాలకు అన్ని రంగాల్లో ప్రాతినిథ్యం లభించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.సభలకు జాతీయ స్థాయి బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల నేతలను, జాతీయ, రాష్ట్ర పార్టీల నేతలు, సినీప్రముఖులను ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు.