మంత్రి కేటీఆర్‌కు సోమువీర్రాజు కౌంటర్

ABN , First Publish Date - 2021-12-31T20:16:02+05:30 IST

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కోపం వచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌కు సోమువీర్రాజు కౌంటర్

అమరావతి: ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు కోపం వచ్చింది. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘నన్ను సారాయి వీర్రాజు అన్నవారు ఏం తాగుతారో నాకు తెలుసు. నాపై ట్వీట్‌ చేసిన కేటీఆర్ తండ్రి తెల్లవారుజాము దాకా ఏం చేస్తారు?.. నేను సారాయి వీర్రాజును కాదు.. బియ్యం వీర్రాజును.. సిమెంట్ వీర్రాజును... కోడిగుడ్ల వీర్రాజును’ అని చెప్పారు. పేదవాడిని దృష్టిలో పెట్టుకునే లిక్కర్‌పై మాట్లాడానని వివరించారు. 


రూ.50కి లిక్కర్ అమ్మితే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.2 లక్షలు మిగులుతాయని సోమువీర్రాజు అన్నారు. తాను చేస్తున్న ప్రతి వ్యాఖ్య 2024 బీజేపీ మేనిఫెస్టోలో పెడతామని స్పష్టం చేశారు. ఏపీలోని ప్రతి సమస్యకు బీజేపీ దగ్గర పరిష్కారం ఉందన్నారు. గుంటూరు జిన్నా టవర్, విశాఖ కింగ్‌జార్జ్ ఆస్పత్రి పేర్లు మార్చాలని డిమాండ్ చేశారు. అసలు కింగ్ జార్జ్ ఎవరు?.. వెంటనే ఆ పేరును మార్చాలన్నారు. లేకుంటే 2024 అధికారంలోకి వచ్చాక తామే మారుస్తామన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న పేరును బీజేపీ ప్రతిపాదిస్తోందని సోమువీర్రాజు వ్యాఖ్యానించారు.

Updated Date - 2021-12-31T20:16:02+05:30 IST