ప్రభుత్వ ఆఫీసుల మిద్దెలపై సోలార్‌ప్లాంట్లు

ABN , First Publish Date - 2021-12-26T08:59:07+05:30 IST

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల మిద్దెలపై ఫొటోవాల్‌టైక్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎ్‌సరెడ్‌కో టెండర్లు పిలిచింది.

ప్రభుత్వ ఆఫీసుల మిద్దెలపై సోలార్‌ప్లాంట్లు

650 కిలోవాట్ల ప్లాంట్ల కోసం టెండర్లు 

హైదరాబాద్‌, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల మిద్దెలపై ఫొటోవాల్‌టైక్‌ పవర్‌ ప్లాంట్లు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీఎ్‌సరెడ్‌కో టెండర్లు పిలిచింది. ఈ ప్రాజెక్టులో భాగంగా.. ఐదారుచోట్ల 650 కిలోవాట్ల సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటుచేస్తారు. టెండర్లు దక్కించుకునే సంస్థలు ఏటా ప్రతి కిలోవాట్‌కు 1500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి జరిగేలా నాణ్యమైన సోలార్‌ప్యానెళ్లను బిగించాలి. ఆసక్తిగల సంస్థలు జనవరి 10వ తేదీలోగా బిడ్లు దాఖలు చేయాలని రెడ్‌కో కోరింది. 

Updated Date - 2021-12-26T08:59:07+05:30 IST