నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

ABN , First Publish Date - 2021-08-20T09:07:05+05:30 IST

అపార్టుమెంటులోని నాలుగో అంతస్తు నుంచి జారి పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఈ విషాదం జరిగింది.

నాలుగో అంతస్తు నుంచి పడి చిన్నారి మృతి

మంచిర్యాల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): అపార్టుమెంటులోని నాలుగో అంతస్తు నుంచి జారి పడి రెండేళ్ల చిన్నారి మృతిచెందింది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం ఈ విషాదం జరిగింది. ఏసీసీ కాలనీలోగల ఎస్‌ఆర్‌ రెసిడెన్సిలోని నాలు గో అంతస్తులో కొండబత్తుల ప్రవీణ్‌కుమార్‌, వాణి దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి కూతురు శాన్విత ఏకైక సంతానం. గురువారం ఉదయం 6 గంటలకు నిద్రలేచిన శాన్విత బాల్కనీలోకి వచ్చింది. సిమెంట్‌ గ్రిల్స్‌ నుంచి కిందికి చూస్తుండగా ప్రమాదవశాత్తు జారి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో పడింది. చుట్టుపక్కల వారు గమనించి కేకలు వేయడంతో తల్లిదండ్రులు వచ్చి చూసేసరికి పాపకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. బిడ్డ మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.  

Updated Date - 2021-08-20T09:07:05+05:30 IST