ఫార్మాసిటీలో ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ

ABN , First Publish Date - 2021-08-10T07:57:38+05:30 IST

హైదరాబాద్‌ ఫార్మాసిటీకి భూములు అందించిన కుటుంబాల వారికి ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌

ఫార్మాసిటీలో ఉద్యోగాలకు నైపుణ్య శిక్షణ

ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ 


హైదరాబాద్‌, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ ఫార్మాసిటీకి భూములు అందించిన కుటుంబాల వారికి ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ అన్నారు. ఉద్యోగాలకు కావాల్సిన నైపుణాన్ని సాధించేందుకు ఉద్దేశించిన రెండు నెలల శిక్షణ కార్యక్రమం సోమవారం ఫార్మాసిటీలో ప్రారంభమైంది. తొలి బ్యాచ్‌లో 120 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జయేశ్‌ రంజన్‌ మాట్లాడారు. టీఎ్‌సఐఐసీ, టాస్క్‌ సంయుక్త ఆధ్వర్యంలో ట్రైనింగ్‌ మాడ్యూల్స్‌, ప్రొడక్షన్‌ ఆపరేటర్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ అసిస్టెంట్‌  వంటి ఉద్యోగాలకు రెండు నెలల శిక్షణ ఇస్తున్నామన్నారు. కోర్సు పూర్తయిన వెంటనే ఉపాధి అవకాశాలూ కల్పిస్తామని తెలిపారు.

Updated Date - 2021-08-10T07:57:38+05:30 IST